4 May, 2026 | 4:55 AM

సమస్యలపై విన్న విస్తే ఎదురుదాడా?

04-05-2026 12:00 AM
  1. విపక్షాలపై ఎదురుదాడి పక్కన పెట్టి రైతుల ఇబ్బందులను పరిష్కరించాలి
  2. సీఎంకు మరోసారి లేఖ రాసిన కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): వడ్ల కొనుగోలు వ్యవహారంలో విపక్షాలపై ఎదురుదాడి రాజకీయాలను పక్కకు పెట్టి రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని, కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీ లను అమలు చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం బండి సంజయ్ మరోసారి బహిరంగ లేఖ రాశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని లేఖ రా స్తే ఎదురు దాడి చేయడం ఎంతవరకు స మంజసం? అని ఆయన ప్రశ్నించారు.

కళ్లుం డి చూడలేని కబోధి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని, అబద్ధాలు, అవగాహన రా హిత్యంలో తుమ్మల ఆస్కార్‌కు అర్హులని విమర్శించారు. ఎమ్మెస్పీ చట్టం తెస్తానని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్సేనని, సొంత పార్టీ మ్యానిఫెస్టోలో ఏం రాశారో కూడా తెలుసుకోలేని అసమర్ధుడు తుమ్మల అని మండిప డ్డారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా కూడా సక్రమంగా పంపిణీ చేయలేని అసమర్ధ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అని విమర్శించారు.

ఖమ్మం గడ ప దాటి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలను కళ్లారా చూడాలనే సోయిలేని మంత్రికి రైతుల బాధలేం తెలుసన్నారు. రాష్ట్రంలో 25 శాతం వడ్లను మాత్రమే కేం ద్రం కొంటోందని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో 71.86 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 60 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొనుగోలు చేసిందన్నారు. గత రబీ సీజన్‌లో 74.22 లక్షల మెట్రిక్  ట న్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే... 50.10 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం కొనుగోలు చేసిందని పేర్కొ న్నారు.

గత రబీ సీజన్ కంటే 2 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ సీజన్‌లో కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందని చెప్పారు. 12 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు తెలంగాణకు ఇచ్చింది మోదీ ప్రభుత్వమని, సుతిలీతాడు, గోనె సంచె మొదలు వడ్ల కొనుగోలుకు అయ్యే ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమే అన్నారు. వ్యవసాయ మంత్రిగా కొనసాగే అర్హత తుమ్మలకు లేదన్నారు.