13 June, 2026 | 1:55 AM

మాజీ కార్పొరేటర్‌కు జరిమానా?

13-06-2026 12:14 AM

రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో నిర్మించిన ‘అరకు’ రిసార్ట్‌పై జరిమానా విధించిన అధికారులు 

సరూర్‌నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీవాణికి చెందిన రిసార్ట్ 

ఎల్బీనగర్, జూన్ 12 : హైదరాబాద్ లోని సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణికి చెందిన రిసార్ట్ పై అధికారులు జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...  సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణికి చెందిన రిసార్ట్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నది. 

తెలంగాణ అరకు రిసార్ట్ పేరుతో నిర్మించిన రిసార్ట్ కు ప్రభుత్వ అధికారులు రూ, 3,59,553 జరిమానా విధించారు. అయితే, జరిమానా విధింపు పూర్తి కారణాలు, నిర్మాణానికి సంబంధించిన అనుమతుల వివరాలపై అధికారుల నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.