యథావిధిగా సింగ రేణి మెడికల్ బోర్డు
- పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలి
- అర్హులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి
- సింగరేణి యాజమాన్యానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
- నేడు మంచిర్యాలలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షి కంగా, వివాదరహితంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో సింగరేణి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత శాసన సభ్యులు, మంత్రులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ అంశంపై కార్మికుల ఆందోళన లను వివరించారని చెప్పారు. మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపం లో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూ చించారు.
ఇటీవల కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో శనివారం జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిలో దశాబ్దాలుగా అపరి ష్కృ తంగా ఉన్న మారుపేర్ల అంశం తమ దృష్టి లో ఉందన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిసు ్తన్నట్లు.. ఇందులో భాగంగానే ఈ అంశంపై న్యాయ పరమైన సలహా తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ సింగరేణి
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నట్టు భట్టి విక్రమార్క వివరించారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సింగరేణిలో 2,657 పోస్టులను భర్తీ చేశామన్నారు. వీటిలో 555 ఎక్సటర్నల్ పోస్టులు ఉండగా, 2,102 కారుణ్య నియామక ఉద్యోగాలను ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రత్యక్ష ఉద్యోగాల భర్తీని కూడా ఆన్‌లైన్ పద్ధతిలో చేపట్టి వివాద రహితంగా అర్హులందరికీ ఉద్యోగాలు కల్పించామన్నారు.
కారుణ్య నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పెంచడం ద్వారా మరింత మంది అర్హులకు అవకాశం కల్పించామని తెలిపారు. దీని ద్వారా ఇప్పటికే 200 మంది లబ్ధి పొందారని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించేలా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. ఇదే కాకుండా బ్యాంకు లతో సంప్రదింపులు జరిపి ఇటీవలే సింగరేణి ఉద్యోగుల కోసం రూ.10 లక్షల ఉచిత సహజ బీమా సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు. గత రెండేళ్లలో రూ.1500 కో ట్లను లాభాల వాటా రూపేనా చెల్లించినట్లు తెలిపారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్‌ను చెల్లిస్తున్నామని, 2023 ఒక్కొక్కరికీ రూ. ఐదు వేలు చొప్పున, 2024 రూ.5,500 చొప్పు న లాభాల బోనస్‌ను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్మికుల కష్టాలు, సమస్యలను ప్రత్య క్షంగా చూశామన్నారు.
అందువల్ల సింగరేణి కార్మికుల పట్ల తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఒడిశా నైనీ బ్లాక్ అనుమతులతోపాటు బొగ్గు ఉత్పత్తికి ప్రజా ప్ర భుత్వంలో తీసుకున్న ప్రత్యేక చొరవను గు ర్తుచేశారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణిని విస్తరించే దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సమావేశంలో మంత్రు లు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క పాల్గొన్నారు.






