4 April, 2026 | 9:38 PM

Breaking News

ఆస్తిపన్ను చెల్లింపులపై 5 శాతం రాయితీ: డిప్యూటీ కమిషనర్ వాణి   •   14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం   •   రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం   •   కలెక్టర్ చొరవతో కుటుంబ సభ్యులను కలిసిన వ్యక్తి   •   ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు   •   భావితరాలకు సంస్కృతి సంప్రదాయాలను తెలిపేది భగవద్గీత   •   సజ్జన్‌పల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం   •   చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 14వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా   •   సుజాత ఇంటర్నేషనల్ స్కూల్‌పై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం   •   క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ   •  

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

05-10-2025 04:29 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చనిపోయిన సభ్యుల పిల్లల చదువుల కోసం ఆర్థిక సాయం అందజేశారు. పట్టణంలోని ఫోటో భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కుటుంబ భరోసా మిగులు నిధుల నుండి ఒక్కొక్కరికి 5000/- రూపాయల చొప్పున మొత్తం నలుగురి పిల్లలకు 20000/-రూపాయల చెక్ ను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి మాట్లాడుతూ ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమానికి అసోసియేషన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్, మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్, కార్యదర్శి బాణావత్ కృష్ణ, ప్రచార కార్యదర్శి రామస్వామి సురేందర్ లు పాల్గొన్నారు.