16-02-2026 09:35:25 PM
నామాపురం మాజీ ఎంపీటీసీ ఊరి పక్క సరిత నాగేష్
మర్రిగూడ: మండలం ఇందుర్తి గ్రామంలో నామ రమేష్ అకాలంగా మృతి చెందడంతో ఆ కుటుంబానికి మాజీ ఎంపీటీసీ ఊరిపక్కసరిత నగేష్ బాధిత కుటుంబానికి రూ.10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. సందర్భంగా మాజీ ఎంపిటిసి మాట్లాడుతూ... చిన్న వయస్సులో తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తోందని వేదన వ్యక్తం చేశారు.
మృతుడికి 12 సంవత్సరాల కుమార్తె 10 సంవత్సరాల కుమారుడు ఉండటంతో ఆ కుటుంబ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరి యాదయ్య దొడ్డి యాదగిరి దొడ్డి యాదయ్య శ్రీను మహేష్ గుల్లి నరసింహ లపంగి బిక్షం తదితరులు పాల్గొని కుటుంబాన్ని ఓదార్చారు.