20 April, 2026 | 7:13 AM

చదువుల తల్లికి ఆర్థిక సహాయం

20-04-2026 12:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన సుంకరి హిమబిందు భర్త, తండ్రి చనిపోయిన అధైర్య పడకుండా చదువుకోవాలని పట్టుదలతో మహబూబాబాద్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీ చదివి 985/1000 రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితం సాధించిన నేపథ్యంలో ఆ విద్యార్థిని స్వగ్రామం నడివాడలోని ఆమె ఇంటివద్ద ‘గుడ్ ఫ్రెండ్స్’ సభ్యులు 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపికా రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి తమ లక్ష్య సాధన కోసం సంకల్పబలంతో ముందుకు వెళ్లాలన్నారు. హిమబిందు మట్టిలో మాణిక్యమని, గ్రామీణ ఆణిముత్యమని కొనియాడారు. నేడు ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివిన విద్యార్థులు భవిష్యత్ సమాజ నిర్మాణానికి పునుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం, అధ్యాపకులు చొప్పరి శ్రీనివాస్, గుడ్ ఫ్రెండ్స్ సభ్యులు గాంతి దేవేందర్ రెడ్డి, మేడ వెంకటేశ్వర్లు, మైస శ్రీనివాసులు, బానోత్ కిషన్, గుగులోత్ దేవుసింగ్, తోడేటి వెంకన్న, వాసం నాగేశ్వర్ రావు, బీ.కిషన్, శంకర్, బూర్ల ప్రభాకర్, నడివాడ గ్రామ సర్పంచ్ విజయ్,  ‘మా’ అసోసియేషన్ బాధ్యులు మందుల రఘు పాల్గొన్నారు.