20 April, 2026 | 8:34 AM

క్రమపద్ధతిలో మక్కల కొనుగోళ్లు

20-04-2026 12:00 AM

కేసముద్రం, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లతో పాటు, మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా మక్కల కొనుగోళ్లను క్రమ పద్ధతిలో నిర్వహించడానికి ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు.

కేసముద్రం మండలంలో అదనంగా ఏర్పాటుచేసిన తాళ్లపూస పల్లి మక్కల కొనుగోలు కేంద్రంతో పాటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో మండల పరిధిలోని రైతులు పండించిన మక్కలను కొనుగోలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. మండల పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులకు ముందుగానే మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే విధంగా తేదీలను ఖరారు చేసి ఎక్కడ కూడా రద్దీ లేకుండా, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. 

ఇప్పటివరకు ఒక లక్ష పదివేల బస్తాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులకు ప్రభుత్వం ద్వారా మద్దతు ధర అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రకటించిన తేదీకి ముందుగానే తర్వాత గాని చేయకూడదని, నిర్దేశించిన ప్రమాణాల ప్రకారంగా మక్కలను శుభ్రపరిచి 14 శాతం తేమ లోబడి ఉండే విధంగా విక్రయానికి తేవాలన్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఇప్పటివరకు పేరుకుపోయిన మక్కలను పూర్తిగా కొనుగోలు చేసి కొత్తగా ప్రవేశపెట్టిన కార్యాచరణ ప్రణాళిక ద్వారా కొనుగోళ్ళను ఆదివారం చైర్మన్ ప్రారంభించారు.