1 March, 2026 | 6:46 PM

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం

01-03-2026 04:19 PM

బ్యాచ్ మెంట్స్ ఔదార్యం..

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.2 లక్షలు అందజేత

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ముష్కే వెంకట్ కుటుంబానికి ఆయన మిత్రులు రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. 2000 బ్యాచ్ కు చెందిన వెంకట్ సహ పోలీసు ఉద్యోగులు సేకరించిన. రూ.2 లక్షల చెక్ ను ఆయన కుటుంబానికి  అందించారు. తన మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా ఆపన్న హస్తం అందిస్తూ ఇదిరా స్నేహమంటే అని పోలీసుశాఖలో ఔరా అనిపించుకున్నారు.