14 August, 2026 | 5:23 AM

బాల్య మిత్రుడి కుటుంబానికి రూ.65 వేల ఆర్థికసాయం

14-08-2026 12:08 AM

వనపర్తి మండలం, ఆగస్టు 13: తోటి మిత్రుడు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అండగా నిలిచారు జెడ్పీహెచ్‌ఎస్ పెద్దగూడెం 2004 బ్యాచ్ విద్యార్థులు. రాణిపేటకు చెందిన ఎం. పురేందర్రెడ్డి (38) రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లల కుటుంబ పరిస్థితిని గుర్తించిన మిత్రులు చందాలు సేకరించి రూ.65 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ మొత్తాన్ని పిల్లల చదువులు, భవిష్యత్తుకు వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో రాములు యాదవ్, ల్యాబ్ రాము, హుస్సేన్ పాషా, వెంకటేష్, బుచ్చిరెడ్డి, రాము, నాగరాజ్, దేవేందర్, నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.