17 August, 2026 | 4:01 AM

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

17-08-2026 12:12 AM

తాడ్వాయి,ఆగష్టు, 16( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన పి.ఎం.పి వైద్యుడు  కమ్మరి ఆంజనేయులు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబం పేదరికంలో ఉన్నందున  ఆదివారం ఆంజనేయులు తోటి స్నేహితులు మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 30 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో స్నేహితులు పాల్గొన్నారు.