గరుగల్ల బాలరాజు కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేత
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) సీనియర్ నాయకులు గరుగల్ల బాలరాజు కుటుంబానికి మాదిగ జాతికి చెందిన జర్నలిస్టులు, నాయకులు, ఎమ్మార్పీయస్ నాయకులు అండగా నిలిచారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న ఆధ్వర్యంలో గురువారం బాలరాజు కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా గంగన్న మాట్లాడుతూ.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో ఎమ్మార్పీయస్ ఆధ్వర్యంలో సాగిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి బాన్సువాడ నియోజకవర్గంలో గరుగల్ల బాలరాజు విశేషంగా కృషి చేశారని తెలిపారు.బాలరాజు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఎర్రోళ్ల అశోక్, ముక్కగల్ల ప్రసాద్, ఎర్రోళ్ల సాయిలు మహారాజ్, ఎర్రోళ్ల భూమయ్య, బోయి సీతయ్య, బోయి చిన్న సాయిలు, కాదేపురం గంగన్న, ఎర్రోళ్ల గంగారాం, కోటగిరి సతీష్, మావురం సాయిబాబా, మారుశెట్టి హన్మండ్లు, కూనింటి రాము, టేకుర్ల సాయి, రొడ్డ వెంకటి, సంతోష్ , తోపాటు కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, నాయకులు, జర్నలిస్టులు, తదితరులు, పాల్గొన్నారు.






