బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి సమక్షంలో బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ నూతన కమిటీని ప్రకటించారు.
అధికార ప్రతినిధిగా దేవసాని ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ గా దుబాసి వెంకటస్వామి, ఎండీ ఇక్రముద్దీన్, కొత్తపల్లి శ్యాం కుమార్, అబ్దుల్ కలీల్, ఆడెపు మహేష్, ఎండీ వాజిద్, జనరల్ సెక్రెటరీ గా దెబ్బటి రమేష్,కన్నూరి వెంకటేష్, గుజ్జ రవి, కొట్టే వెంకటస్వామి, గంధం రమేష్, ఎండీ జమీల్ ను ఎన్నుకున్నారు. సెక్రటరీగా, పారపల్లి పరమేష్, కేశబోయిన శ్రీనివాస్, అచ్చిన సాయికిరణ్, మరెల్లి శ్రీనివాస్, జాన్ సుందర్, ఎల్తూరి శంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఆరు గురిని నియమించారు.






