20 August, 2026 | 9:27 PM

విద్యార్థులకు ఆట పరికరాలు అందజేత

20-08-2026 08:17 PM

బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కోలం వరుర్ పాఠశాల విద్యార్థులకు గురువారం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆట వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని వెనుకబడిన గ్రామాలలో చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు సహాయ సహకార అందించి క్రీడల్లో ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. క్రీడల్లో ఆసక్తి కనబరిచిన విద్యార్థుల మేధాశక్తి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుందని చదువుపై కూడా ఆ ఉత్సాహం ఉపయోగపడుతుందని తెలియజేశారు. రానున్న రోజుల్లోనే విద్యార్థులకు అవసరమైన క్రీడా పరికరాలు అందించేందుకు తాను ముందుంటారని తెలియజేశారు.