విద్యార్థినికి ఆర్థిక సహాయం
అందజేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, జూన్ 10: పారామెడికల్ రేడియాలజీ కోర్సు అభ్యసించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం అందజేశారు. నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం గ్రామానికి చెందిన చింత సుజాత, సత్యనారాయణ దంపతుల కుమార్తె చింత అంజలి పారామెడికల్ రేడియాలజీ కోర్సు అభ్యసించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ దాసరి రాజు, ఈ విషయాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లారు.
విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం, విద్యార్థిని చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, మాజీ సర్పంచ్ యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నరసింహ పలువురు నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






