23-02-2026 12:17:03 AM
వరంగల్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.తమన్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన తమన్ కు ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కురి మయూరి రామేశ్వర్రావు, అనంతుల శ్రీనివాస్, ఈవో రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు ఘనంగా స్వాగతం పలికారు.
తమన్ అమ్మవారికి ప్రత్యక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ ఆశీర్వచన మండపంలో అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకంరించి ప్రసాదములు అందజేశారు. అలాగే అమ్మవారిని జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.