14 August, 2026 | 4:54 PM

మానే(నీ)రు నీటితో చెరువులు నింపండి

14-08-2026 04:12 PM

* సామాజిక ఉద్యమ నాయకుడు కానుగంటి కొండయ్య 

ముస్తాబాద్,(విజయక్రాంతి): ఆలస్యమైనా విస్తారంగా కురిసిన వర్షాలకు ఎగువ మానేరు నిండి మత్తడి దూకుతుంది.ఇలాంటి సమయంలోనే కుడి కాలువ ద్వారా ముస్తాబాద్ మండలంలోని చెరువులు, కుంటలు నింపి నీటి ఎద్దడి లేకుండా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమ నాయకుడు, ప్రకృతి ప్రేమికుడు కానుగంటి కొండయ్య పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఈ సారి కొంత ఆలస్యమైన వర్షాలు పడి మానేరు నిండింది.

వర్షపాతం తక్కువగా ఉన్నందున నీటిని వృధాగా పోనియకుండా కుడి ఎడమ కాలువల ద్వారా అనుసంధానంగా ఉన్న చెరువులు,కుంటలు నింపాలని ఇరిగేషన్ అధికారులకు పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగి త్రాగు,సాగు నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు,ప్రజలు హర్షిస్తారని వెల్లడించారు. వర్షాకాలంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రకృతి ప్రేమికుడిగా తన అభిప్రాయాన్ని వెలిగించారు.