‘బుడుబవై’ సందడి
16-05-2026 08:51 PM
అమావాస్య సందర్భంగా ఆదివాసీ చిన్నారుల ఆటపాటలు
సిరికొండ,(విజయక్రాంతి): అమావాస్యను పురస్కరించుకుని సిరికొండ మండలంలోని కోసు పటేల్‌గూడలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక ఆదివాసీ సంప్రదాయం ప్రకారం చిన్నారులు ‘‘బుడుబవై… కుకూ…’’ అంటూ సందడి చేశారు. కప్పతల్లిని రోకాలి(హాకా)తో కట్టి ప్రతి ఇంటికీ తిరుగుతూ పెద్దలకు బొట్టు పెట్టి ఆశీర్వాదాలు పొందారు. నీటితో స్నానం చేసి గ్రామమంతా ఎగురుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ మురిసిపోయారు. ప్రతి ఆదివాసీ గిరిజన గ్రామంలో అమావాస్య రోజు ప్రత్యేకంగా నిర్వహించే ఈ సంప్రదాయ కార్యక్రమం కోసు పటేల్‌గూడలో హర్షోల్లాసంగా సాగింది. గ్రామస్తులు పిల్లల్ని అభినందిస్తూ సంప్రదాయ సంస్కృతి అలానే కొనసాగాలని ఆకాంక్షించారు.






