ఎస్‌ఐఆర్ ఎఫెక్ట్..
- ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఓట్లు 3.92 లక్షలు
- కరీంనగర్ జిల్లాలో అత్యధికం
కరీంనగర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): సర్ ప్రక్రియ అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3లక్ష 92 వేల ఓట్లు తగ్గాయి. వీటి లో ఎక్కువగా మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు తమ ఓటు తరలించుకున్నవాళ్లు, కలిగిన వాళ్లు ఉన్నారు. ఈ ఓట్లన్నీ జాబితా నుంచి తొలగిపోనున్నాయి. వీటిని తొలగించి ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈ నెల 17న ముసాయిదా జాబి తాల ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తారు.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 10,89, 090 ఓటర్లు ఉండగా ఇందులో 9,11,445 మంది ఎమ్యురేషన్ ఫారాలు అందాయి. 1,77,645 మంది నుండి అందలేదు. పెద్దపల్లి జలాల్లో మొత్తం 7,12,157 ఓటర్లు ఉండగా 6,30,930 మంది ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్వోలకు ఇచ్చారు. 81,227 మంది నుండి ఎంయురేషన్ ఫారాలు అందలేదు. జగిత్యాల జిల్లాలో మొత్తం 7,21,032 మంది ఓటర్లు ఉండగా 6,46,138 మంది ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్వోలకు ఇచ్చా రు.
74,894 మంది నుండి ఫారాలు అందలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం ఓట ర్లు 4,75,694 మంది ఉండగా, 4,17,162 మంది ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్వోలకు ఇచ్చారు. 58,532 మంది నుండి అందలేదు. సర్ ప్రక్రియ కు ముందు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్లు 29,97,973 మంది ఉండగా, 26, 05,675 ఓటర్లు మాత్రమే తమ ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్వోలకు ఇచ్చారు . మొత్తంగా 3,92,298 మంది నుండి ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు.
- కరీంనగర్ అసెంబ్లీలో తగ్గిన లక్ష ఓట్లు..
ఎస్‌ఐఆర్ తో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తగ్గాయి. ఎస్‌ఐఆర్ కు ముందు 3,68,832 మంది ఓటర్లు ఉండగా, ఎస్‌ఐఆర్ ఆ తర్వాత 2,67,978 మంది ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. 1,00, 854 మంది ఇన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. ఇందులో 9428 మంది మరణిం చగా, 74,545 మంది ఇతర ప్రాంతాలకు చెందినవారు, 8077 మంది డబుల్ ఓట్లు గా గుర్తించారు. మొత్తానికి కరీంనగర్ నియోజకవర్గంలో 1,00,854 ఓట్లు తగ్గాయి.
- 17న ముసాయిదా జాబితా
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ నెల 17 నుండి సెప్టెంబర్ 16 వరకు నోటీసులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార దశ ఉంటుంది. ఓటర్ల తుది జాబితా అక్టోబర్ 19 న ప్రకటించనున్నారు.






