11 August, 2026 | 7:42 PM

జిపి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

11-08-2026 06:46 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): పెంబి మండలం అంకేనా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ప్రభుత్వ నిధులతో ఈ భవనం పూర్తి చేసినట్టు తెలిపారు. అనంతరం గ్రామంలో 30 లక్ష్యలతో నిర్మించే వ్యవసాయ గోదాము నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామాల్లో ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను వస్తానని సమస్యలు తమ దృష్టికి తేవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు నాయకులు పాల్గొన్నారు.