రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
- ఆత్మ ఛైర్మెన్ సింగతి మురళి
హాజీపూర్, (విజయక్రాంతి): మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆత్మ (Agricultural Technology Management Agency) ఛైర్మెన్ సింగతి మురళి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేధికలో మంగళ వారం నిర్వహించిన బ్లాక్ లెవెల్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ (BFAC) సమావేశంలో మంచిర్యాల ADA మామిడి క్రిష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోని గ్రామాలలో రైతులతో సమావేశం నిర్వహించాలని , రైతులకి వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రభుత్వ పథకాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, పంటల యాజమాన్యం,
మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలనీ కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, నూతన శాస్త్రీయ పరిజ్ఞానం రైతులకి చేరవేయడమే లక్ష్యం అని అన్నారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలో ఉన్న ఆత్మ డైరెక్టర్లు జగన్ రెడ్డి, బలమల్లు, గడ్డం సత్యం, AMC డైరెక్టర్ మునిమడుగుల శ్రీనివాస్, మంచిర్యాల డివిజన్ పరిధిలో ఉన్న వ్యవసాయ అధికారులు క్రిష్ణ, అంజిత్, మహేందర్, వీరన్న, హార్టికల్చర్ అధికారి సహజ, వెటర్నరీ డాక్టర్ రాకేష్, AEO మధుప, BTM సంధ్య, వ్యవసాయ శాఖా, అనుబంధ శాఖలైన్ ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ, పట్టుపరిశ్రమ, మత్స్య శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.






