16 May, 2026 | 9:39 PM

రైతుల పక్షాన మిల్లర్లు బాధ్యత తీసుకోవాలి

16-05-2026 08:53 PM

మిల్లుకు వచ్చిన వాహనాల నుండి త్వరితగతిన వరి ధాన్యం దిగుమతి చేయాలి

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

తుంగతుర్తి(విజయక్రాంతి): రైతుల పక్షాన మిల్లర్లు బాధ్యత తీసుకొని మిల్లులో వరి ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని ఎస్పి నరసింహ మిల్లర్లను కోరారు. నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామం వద్ద ఉన్న సోమేశ్వర రైస్ మిల్ నందు వరి ధాన్యం దిగుమతులను శనివారం జిల్లా ఎస్పీ నర్సింహా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పంట దిగుమతి బాగా వచ్చింది, రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు.

కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వరి ధాన్యాన్ని వాహనాల నుండి త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని మిల్లు యజమానులకు సూచించారు, మిల్లు యజమానులతో, మిల్లులో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి ధాన్యం దిగుమతి వివరాలు తెలుసుకున్నారు. వరి ధాన్యాన్ని తరలించడానికి లారీ యజమానులు డ్రైవర్లు సహకరించాలని కోరారు. పండిన పంట వర్షంలో తడవకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలని అవసరమైన టార్ఫాలీన్లు పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు పంపాలని సూచించారు.