కేజీబీవీలో వసతులు పరిశీలించిన సర్పంచ్
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మంగళవారం సందర్శించి పాఠశాలలోని వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ జె. శ్రీలత పాఠశాలలోని ప్లే గ్రౌండ్‌ను సర్పంచ్‌కు చూపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మైదానం కోతకు గురై, విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
మైదానాన్ని మొరం పోయించి లెవలింగ్ చేయించాలని సర్పంచ్‌ను కోరారు.స్పెషల్ ఆఫీసర్ విజ్ఞప్తికి సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ సానుకూలంగా స్పందించి, మైదానాన్ని లెవలింగ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






