రామగిరిలో ఇండస్ట్రియల్ పార్క్‌కు రూ.1.10 కోట్లతో ఫెన్సింగ్
రామగిరి, ఆగస్టు 9 (విజయక్రాంతి): రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచా యితీ పరిధి మేడిపల్లి-రామగిరిఖిల్లా శివారులో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంకు భూసేకరణ పూర్తి అయింది. రత్నాపూర్ గ్రామానికి చెందిన రైతుల నుండి పట్టా, ప్రభుత్వ భూములు సుమారు 280 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ భూములలో పలు ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ఐటి, ఇండ స్ట్రియల్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ నెల 03వ తేదీన ఈ ప్రాంతంలో పర్యటించారు.
ఈ భూమి చుట్టు ఫెన్సింగ్ నిర్మాణం పనులకు టెండర్లు పూర్తి కాగా పనులు ప్రారంభం అయ్యాయి. రూ.1.10 కోట్లు నిధులు కేటాయించగా హైదరాబాద్ కి చెందిన సివిజన్ కంపెనీ టెం డర్లు దక్కించుకుంది. శ్రీరామ్ సాగర్ కాలువ నుంచి పల్లె ప్రకృతి వనం వరకు సుమారు 500 మీటర్లు ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మిస్తారు. ఆరు కిలోమీటర్ల చుట్టూ తో 5 వైర్లతో ఫెన్సింగ్ వేస్తారు. నిధు లు మంజూరు చేసి పనులు ప్రారంభించటం పట్ల సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు హర్షం వెళ్లబుచ్చారు.






