10 August, 2026 | 4:24 AM

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి

10-08-2026 12:26 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ఆగస్టు 9(విజయక్రాంతి): మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువజన విభాగం క్రియాశీలకంగా వ్యవ హరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్రెడ్డి, మానయ్య, నరసింహ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీశైలం, యూత్ కాంగ్రెస్ నాయకులు షాబుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.