5 June, 2026 | 9:13 PM

సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర అమూల్యం

05-06-2026 07:58 PM

* ఆర్యవైశ్య మహాసభ జిల్లాధ్యక్షులు: బుస్స దశరథం

* వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే హెచ్-143 వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బుస్స దశరథం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని బుస్స దశరథం పేర్కొన్నారు. అనంతరం లాయక్ పాషా, నర్సయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం పనిచేస్తోందన్నారు. సన్మానానికి సహకరించిన ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి జనార్ధన్తో పాటు సంఘ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.