11 July, 2026 | 10:15 PM

గాయని ఎస్.జానకి హఠాన్మరణం

11-07-2026 09:01 PM

దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన సుప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్.జానకి (88) కన్నుమూశారు. మైసూర్ లోని ఆసుపత్రిలో గుండపోటు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లపాటు సంగీత రంగాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. జానకి తన విశిష్టమైన గాత్రంతో అనేక దక్షిణ భారత భాషలలోని శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో వేలాది చిరస్మరణీయమైన, ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి. ఈ దిగ్గజ గాయని మరణం పట్ల సంగీత ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.

తెలుగు సినీ వినీల ఆకాశంలో మధురగాయనిగా ఖ్యాతిగాంచిన ఎస్.జానకి తెలుగుచలన చిత్రసీమలో ఆణిముత్యాల్లాంటి పాటలకు ప్రాణం పోశారు. అన్ని భాషల్లో కలిపి సుమారు 50 వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారాలు సహా, 33 ఫిల్మ్ అవార్డులు పొందారు. అంతేకాకుండా 2013లో ఎస్.జానకిని భారత ప్రభుత్వం పద్మ భూషణ్ తో సత్కరించారు. గాయని గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామం ఎస్.జానకి స్వస్థలం. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఈమె, తొలితరం ఘంటసాల నుంచి మలితరం బాలసుబ్రమణ్యంతో కలిసి అద్భుత గీతాలు ఆలపించారు.