11 July, 2026 | 9:24 PM

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం

11-07-2026 08:31 PM

నవోదయ రంగారెడ్డి ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నవోదయాలో అర్హులైన విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశం కొరకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్ తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులై 6వ తరగతిలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అర్హత పరీక్షల్లో ప్రావీణ్యం చూపించినవారికి సీటు లభిస్తుందన్నారు. నవోదయాలో విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత లభిస్తుందని, ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించారని తెలిపారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యబుద్ధులు నేర్పిస్తుందన్నారు. HTTPS://NAVODAYA.GOV.IN ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాగా సూచించారు. తగిన సమాచారం నిమిత్తం అన్ని దినపత్రికలలో చూచుకోవాలని తెలిపారు.