బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో ఎన్డిపీసీఎల్ అసిస్టెంట్ లైన్‌మెన్ వెంగల్ రెడ్డి అందిస్తున్న సేవలకు ఆగస్టు 15న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయి అవార్డు అందుకున్నారు. తెర్లుమద్ది గ్రామ ప్రజలు వెంగల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.
విధి నిర్వహణలో నిజాయితీగా నిబద్దతతో పని చేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుందని బిఆర్ఎస్ యువ నాయకుడు బైతి నవీన్ పేర్కొన్నారు. అధికారులు ప్రజల కోసం నిస్వార్థంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు విలువ, గౌరవం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సౌజన్య, వార్డు సభ్యులు బద్ధ రాములు, చిర్రం మహేష్, అంతడుపుల మంజుల దేవయ్య గ్రామస్తులు యాదగిరి, కనకయ్య, పర్షరాములు, రాజలింగయ్య తదితరులు పాల్గొన్నారు.






