18 August, 2026 | 6:26 PM

కవితమ్మ ఉచిత విద్య, ఉచిత వైద్యం, భూలక్ష్మి పథకాల వైపు ఆకర్షితులైతున్న మహిళలు

18-08-2026 05:09 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని చినూర్ గ్రామానికి చెందిన పలువురు ఆడపడుచులు సోమవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు పద్మ కండువా కప్పి ఆహ్వానించారు. చినూర్ గ్రామానికి చెందిన 40 మంది ఆడపరచులు  టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... కవితమ్మ టిఆర్ఎస్ పార్టీ వైపు ఉచిత విద్య ఉచిత వైద్యం భూలక్ష్మి లాంటి పథకాల వైపు మహిళలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాగారెడ్డి, మండల యూత్ అధక్షులు ఫహీమ్, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.