18 August, 2026 | 6:25 PM

23న దుబ్బాకలో మాలల మహాధర్నా

18-08-2026 05:37 PM

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న దుబ్బాకలో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి  రాములు కోరారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో 'హలో మాల చలో దుబ్బాక' పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధర్నాలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న మాల నిరుద్యోగులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో కాల్వ నరేష్, మండల యాదగిరి, దారస్వామి, కాల్వ లింగం, రమేష్, భాను, కిషోర్, శేఖర్,నరేష్, సురేష్, సిద్దు పాల్గొన్నారు.