ధర్మారెడ్డి ఎంపిపిఎస్ పాఠశాలలో చేపట్టిన మరమ్మతు పనులు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాలకు మరమ్మత్తు పనులు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు.మరమ్మత్తు పనులు చేపట్టడానికి స్వచ్ఛందంగా గ్రామస్తులు ముందుకు వచ్చి పెయింటింగ్ వేశారని గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. బడినే దేవాలయంగా భావించాలని కోరుతూ మన గ్రామం మనబడి అనే నినాదంతో పెయింటింగ్ వేయడం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ధర్మారెడ్డి ఓటర్ జాబితా విడుదల చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ గ్రామ ఓటర్ జాబితాను పబ్లిష్ చేయడం జరిగిందన్నారు. ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నచో ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఫారం 6, ఫారం 7, ఫారం 8ల ద్వారా అందజేయాలని తెలుపుతూ ఓటర్ జాబితాను పబ్లిష్ చేయడం జరిగిందన్నారు.






