27 July, 2026 | 3:54 AM

బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి సన్మానం

27-07-2026 02:06 AM

సన్మానించిన మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ 

సికింద్రాబాద్, జూలై 26 (విజయక్రాం తి): యోనెక్స్‌సన్రైజ్ 12వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్2026లో అండర్-15 మికస్డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచి ప్రతిభ కనబరి చిన కైలాష్ మోక్షశ్రీ గుప్తాను మాజీ కార్పొ రేటర్ ముద్దం నర్సింహ యాదవ్ శాలువా తో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ మాట్లాడుతూ క్రీడల్లో యువత రాణించడం ఎంతో గర్వకారణం. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి రా ష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆ కాంక్షిస్తున్నాను. యువ క్రీడాకారులను ఎల్ల ప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటామని తెలిపా రు. మోక్షశ్రీ మరిన్ని విజయాలు సాధించా లని ముద్దం నర్సింహ యాదవ్  ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో కైలాష్ రామచందర్, బాలమల్లేశం గుప్తా  పాల్గొన్నారు.