11 July, 2026 | 7:14 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

ఫీజు రియింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి

04-11-2025 01:41 AM

తూప్రాన్, నవంబర్ 3 :రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం తూప్రాన్ బస్టాండ్ చౌరస్తాలోరాస్తారోకో, ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఏబీవీపీ కన్వీనర్ కార్తికేయ మాట్లాడుతూ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న కనీసం ఇప్పటివరకు విద్యార్థుల గురించి మాట్లాడిన ఎమ్మెల్యేలు, మంత్రులు లేరని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులకు వైన్స్ టెండర్ల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే బకాయిలు చెల్లించని పక్షంలో కాంగ్రెస్ సర్కార్ను గద్దె దింపే వరకు ఏబీవీపీ పోరాడుతుందని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్, బండారి ప్రశాంత్, కార్యకర్తలు చంద్రశేఖర్, భాస్కర్, లోకేష్ ,అభిషేక్, అంజి, బాలాజీ, భవాని, నందిని కాలేజీల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.