2 April, 2026 | 3:19 AM

సిద్ధార్ధ పబ్లిక్ స్కూల్‌లో ఫీజుల దోపిడీ

02-04-2026 01:28 AM

రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఉప్పల్ పరిధిలోని సిద్ధార్ధ పబ్లిక్ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. అడ్మిషన్ సమయంలో ప్రతి సంవత్సరం కేవ లం 5 శాతం వరకు మాత్రమే ఫీజులు పెంచుతామని హామీ ఇచ్చిన పాఠశాల యాజమా న్యం, ప్రస్తుతం 25 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమ స్యపై గత కొద్ది రోజులుగా పాఠశాల ఎదుట తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నారు. బాధిత తల్లిదండ్రులు ఎమ్మెల్సీ మల్లన్నను సంప్రదించడంతో ఆయన వెంటనే స్పందించి బుధవారం పాఠశాలకు వెళ్లి యాజమాన్యంతో ప్రత్యక్షంగా చర్చించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంత్రణ లేకుండా ఫీజులు పెంచడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం తగదని స్పష్టం చేశారు.

విద్యా సంస్థలు సామాజిక బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని సూచించారు. అడ్డగోలుగా ఫీజులు పెంచి తల్లిదండ్రులను ఇబ్బం దులకు గురి చేయాలని ప్రయత్నిస్తే సహించబోమని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరిం చారు. వెంటనే సమస్యను పరిష్కరించి, న్యాయమైన ఫీజు విధానం అమలు చేయాల ని పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. తల్లిదండ్రుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు తాను అండగా నిలుస్తానని ఎమ్మెల్సీ మల్లన్న హామీ ఇచ్చారు.