13 June, 2026 | 1:32 PM

న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

13-06-2026 12:10 PM

నందికొండ : నల్గొండ జిల్లా నందికొండ (నాగార్జున సాగర్) పరిధిలోని హిల్ కాలనీలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హిల్ కాలనీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఒక కారు, థార్ (Thar) SUV వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందికొండలోని కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.