12 May, 2026 | 11:17 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

వేగవంతంగా.. ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ

01-03-2026 01:00 AM

భద్రతపై ప్రత్యేక దృష్టి

  1. ఔట్ లెట్ నుంచి 20మీటర్లు పూర్తి
  2. అత్యాధునిక పరిజ్ఞానంతో తవ్వకాలు 
  3. నీటిపారుదల శాఖ -మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ పనులు వేగవంతంగా కొనసాగుతు న్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే దేవరకొండ భాగంలోని ఔట్ లెట్ సొరంగ మార్గం 20మీటర్ల దూరం తవ్వకం పూర్తయ్యిందని వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

శ్రీశైలం నుంచి ఇన్ లెట్ సొరంగ మార్గం పను లు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారని ఆయన తెలిపారు. అయితే, సొరంగ మార్గం తవ్వకాల్లో భద్రతా చర్యలకే పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తవ్వకాల సమయంలో అవసరమైన గాలి ప్రసరణతో పాటు సొరంగమార్గం తవ్వేటప్పుడు వచ్చే నీటిని తొలగించేం దుకు చేపడుతున్న చర్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భూభౌతిక పరిస్థితుల కు అనుగుణంగా టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం) విధానాన్ని విరమించుకుని అత్యాధు నిక పరిజ్ఞానంతో తవ్వకాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సురక్షిత మార్గాలు అన్వేషించి అదనంగా వెంటిలేషన్, విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకున్నట్లు వివరించారు. 2025 ఫిబ్రవరి నెలలో ఎస్‌ఎల్‌బీసీ తవ్వకాల్లో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమా ద ఘాటనను దృష్టిలో పెట్టుకొని అటువం టి ఘటనలు పునరావృతం కాకుండా  కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన అధి కారులను ఆదేశించారు.

2028 జూన్ నాటి కి ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలను అనుసరించి 24 గం టలు మూడు షిఫ్ట్‌లలో పనులు చేపడుతున్నామన్నారు. అందుకు గానూ సొరంగ మా ర్గం-1, సొరంగ మార్గం 2లలో తవ్వకాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పూర్తిస్థాయిలో సమీక్షించారు. నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.