18 July, 2026 | 3:29 PM

హైదరాబాద్ నలువైపులా హైడ్రా భారీ ఆపరేషన్లు

18-07-2026 03:22 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేతృత్వంలో ఏర్పడిన హైడ్రాకు రోజు రోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ప్రజల నుంచిఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ నగరం నలువైపులా హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒకే రోజు రూ. 30 వేల కోట్ల విలువైన భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది.

శంషాబాద్ మండలంలో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. రాయదుర్గంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. కంటోన్మెంట్ లో 106 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసింది. స్థానికుల ఫిర్యాదు, రెవెన్యూ అధికారులు వినతితో హైడ్రా రంగంలోకి దిగింది. పోలీసు, హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమన్వయంతో ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేసినట్లు హైడ్రా అధికారులు(HYDRA officials) పేర్కొన్నారు.