18 July, 2026 | 3:45 PM

శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఆషాడ మాసం బోనాలు

18-07-2026 03:22 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీ సరస్వతీ శిశు మందిర్ హైస్కూల్, కరీంనగర్‌లో ఆషాఢ మాసపు ముందస్తు బోనాల వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకొని తలపై బోనం ఎత్తుకొని, విద్యార్థులు పోతు రాజుల వేష ధారణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పూలతోరణాలు, మామిడి ఆకులతో అందంగా అలంకరించారు. పాఠశాల ప్రదానాచార్యులు మోర రణధీర్ బోనాల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, గట్టు శ్రీనివాస్ మరియు ఆచార్యుల బృందం ఉత్సాహంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.