15 June, 2026 | 7:52 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

యూరియా కోసం రైతుల ధర్నా!

30-12-2025 01:47 AM

మొబైల్ యాప్ నిబంధన తొలగించాలని డిమాండ్

ఖమ్మం జిల్లా తల్లాడలో ఆందోళన

ఖమ్మం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ మొబైల్ యాప్ నిబంధనలతో ఇబ్బందులు పెడుతున్నామంటూ ఖమ్మం జిల్లా రైతులు సోమవారం రోడ్డెక్కారు. జిల్లాలోని తల్లాడకు చెందిన రైతులు సోమవారం ప్రభుత్వ విక్రయ కేంద్రాలకు వెళ్లగా యూరియా దొరకలేదు. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనలపై ఆగ్రహానికి గురయ్యారు. యాప్ నిబంధన తొలగించి, నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఏవో తాజుద్దీన్ అక్కడి వెళ్లి యూరియా అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.