10 June, 2026 | 2:26 PM

Breaking News

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •   కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు   •  

రైతులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకావద్దు

03-01-2026 12:00 AM

అలంపూర్, జనవరి 2: అలంపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో యూరియా మరియు ఇతర ఎరువుల తనిఖీ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్ మరియు జులేకల్ కేంద్రాలను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులకు తగిన మోతాదులో యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.

రైతులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ అవసరానికి అనుగుణంగా యూరియాను కొనుగోలు చేయవచ్చని సూచించారు.  యూరియా కొనుగోలు చేసేందుకు రైతులు తమ ఆధార్ కార్డు మరియు పొలం పాస్బుక్ తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వెళ్లి, వివరాలను నమోదు చేసుకున్న తర్వాత యూరియా బస్తాలను పొందవచ్చని జిల్లా అధికారి వివరించారు.