26 May, 2026 | 6:50 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

టీటీడీ ఆలయంతోపాటు మంథనిలో కల్యాణ మండపాన్ని నిర్మించాలి

03-01-2026 12:00 AM

మంథని జనవరి 2 (విజయక్రాంతి): టీటీడీ ఆలయం మరియు కళ్యాణ మండపాన్ని మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా గల మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కు చెందిన ఖాళీ స్థలంలో నిర్మించాలని కోరుతూ మంథని ఆర్డీఓ కాశబోయిన సురేష్ కు శుక్రవారం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డిసెంబర్ మాట్లాడుతూ మంథని ప్రజలందరికీ టీటీడీ ఆలయం మరియు కళ్యాణ మండపం అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఆర్డీవో సురేష్ కు వినతి పత్రం ద్వారా అందజేయడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థల పరిశీలన కోసం పరిశీలిస్తామన్నారు.డిగంబర్ తో పాటు బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్  పాల్గొన్నారు.