11 April, 2026 | 4:12 AM

రైతులు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించుకోవాలి

11-04-2026 02:04 AM

తాడ్వాయి, ఏప్రిల్, 10 (విజయ క్రాంతి ): రైతులు పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు ఇప్పించుకోవాలని పశువైద్యాధికారి అనూష తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామంలో శుక్రవారం పశువులకు గాలి కుంటి వ్యాధి టీకాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాలు తగ్గడం,పెరుగుదల తగ్గడం వంటి సమస్యలు పశువులకు వస్తాయని తెలిపారు.

పాల దిగుబడి తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఈ వ్యాధిని నిర్మించడం కోసం ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 300 ఆవులకు,350 గేదెలకు టీకాలు అందించారు.ఈ కార్యక్రమంలో  సర్పంచ్ పుష్పలత,ఉప సర్పంచ్ రాజయ్య,పాల కేంద్రం అధ్యక్షులు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.