4 May, 2026 | 3:41 AM

సేంద్రియ ఎరువులపై రైతన్న ఆసక్తి

04-05-2026 02:15 AM

వాంకిడి, మే 3 (విజయక్రాంతి): ప్రస్తుతం రైతులు సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారిస్తున్నారు. పంటల సాగుకు ముందుగా దుక్కులు దున్నుకుంటూ, భూసారాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పంటచేళ్లలో భూమిని సారవంతం చేయడానికి సహజ ఎరువులను వినియోగిస్తున్నారు.

పశువుల పెంపక దారులతో రైతులు ఒప్పందాలు చేసుకుని, తమ పంటచేళ్లలో ఆవు పేడతో పాటు గొర్రెల మందలను కూర్చోబెడుతున్నారు. రైతులు సహజ ఎరువులను ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా తమ పంటచేళ్లకు తరలిస్తు న్నారు. ట్రాక్టర్ ద్వారా తీసుకువచ్చే ఆవు, గేదెల ఎరువుకు రూ. 1,900 నుండి రూ. 2,500 వరకు ఖర్చవుతోందని రైతులు పేర్కొన్నారు.