ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
- CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్
మందమర్రి, (విజయక్రాంతి) : ఐక్య పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కార్మిక సమస్యలపై, హక్కులపై ఐక్యంగా ఉండి పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య, మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసర్ల రాజులింగ్ ,మందమర్రి మున్సిపల్ కార్మిక సంఘం (CITU) నాయకులు పోశయ్య, నర్సయ్య, వెంకటరమణ, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ మందమర్రి డివిజన్ అధ్యక్షులు సాంబారి వెంకటస్వామి, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సావనపెల్లి వెంకటస్వామి, ఆసిఫాబాద్ జిల్లా నాయకులు సంజీవ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.






