పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక
తంగళ్ళపల్లి జూలై 2( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఓ పర్మిట్ రూమ్‌లో గురువారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. మందు సేవించేందుకు వచ్చిన వినియోగదారులు మంచింగ్‌గా వేయించిన పల్లీలు ఆర్డర్ చేయగా, వాటిలో వేయించిన బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటనతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆహార పదార్థాల తయారీలో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆరోపించారు. ఇలాంటి నిర్లక్ష్యం వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. సంబంధిత పర్మిట్ రూమ్ యాజమాన్యంపై ఆహార భద్రత, ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది






