4 May, 2026 | 3:33 AM

డివిజన్ స్థాయిలో ‘ప్రజావాణి’ ప్రారంభం

04-05-2026 02:13 AM

నిర్మల్ మే 3 ( విజయ క్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు ఆదివారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఒక ప్రకటన లో తెలిపారు. ఇందులో భాగంగా రేపటి (సోమవారం) నుండి నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం, భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్ర మాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

కలెక్టరేట్లో ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజావాణితో పాటు, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. డివిజన్ స్థాయి అధికారులు హాజరై ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లా కేంద్రానికి రాలేని మారుమూల గ్రామాల ప్రజలు తమ సమస్యలను స్థానికంగానే విన్నవించుకునే అవకాశం కల్పిం చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.

భూ భారతి, భూ వివాదాలు, విద్యా, వైద్యం, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర పౌర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని తెలిపారు. అందిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.