2 July, 2026 | 5:47 PM

చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు

02-07-2026 05:03 PM

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ 

ధర్మపురి, జూలై2(విజయక్రాంతి):  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీటీఆర్(BRS Working President KTR), మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ లను చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటనీ వెల్గటూర్ మండల మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది కానీ చర్చకు సిద్దమని చెప్పి, పిలిచిన వారిని గన్‌పార్క్ ధగ్గరికి రానివ్వకుండా అరెస్ట్ చేయించడం ప్రజాస్వామ్య బద్ధం కాదన్నారు.

అరెస్ట్ చేయించి మళ్ళీ చర్చలకు రాలేదు అనడంలో ఆంతర్యం ఏమిటో  కాంగ్రెస్ మంత్రులకే అర్ధం అవ్వాలన్నారు.ప్రజా స్వామ్యంలో ప్రశ్నించే వారు ఉంటేనే పరిపాలన బాగుంటుందనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు అయిన జూపల్లి క్రిష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు బీఆర్ఎస్ మాజీ మంత్రులకు సవాల్ విసిరి తప్పించుకోవడం తగదన్నారు. హరీష్ రావు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే ధైర్యం లేనివారు ప్రజలకు సూపరిపాలన పాలన అందించలేరనీ ఆయన ఏద్దేవా చేశారు. ప్రస్తుత మంత్రులు ఇప్పటికైనా సవాళ్లు విసరడం మానేసి నమ్మి ఓటేసిన ప్రజలకు న్యాయమైన పాలన అందించేలా కృషి చేయాలనీ ఈ సందర్బంగా పత్తిపాక వెంకటేష్ మంత్రులకు హితవు పలికారు.