పారిశుధ్యం అప్రమత్తంగా ఉండాలి
02-07-2026 05:08 PM
ఖానాపూర్ ఎంపీడీవో రాధారాథోడ్,
ఖానాపూర్ (విజయక్రాంతి): మండలంలోని గ్రామాల్లో పారిశుధ్యం పై అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎంపీడీవో రాధారాతోడ్ సూచించారు. గురువారం ఆమె నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోడల పంపు, ఎల్లాపూర్ గ్రామాలను సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పరిశీలించారు. గ్రామంలో నర్సరీలను సందర్శించి పలు సూచనలు చేశారు. అనంతరం వర్షాకాలం నేపథ్యంలో గ్రామంలో పారిశుధ్యం సరిగ్గా నిర్వహించాలని ఆమె అన్నారు. ఆమెతోపాటు సెక్రటరీలు పలువురు ఉన్నారు.






