25 May, 2026 | 9:08 PM

బాధిత కుటుంబానికి రైస్ బ్యాగ్ వితరణ

25-05-2026 08:10 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని కన్నా రెడ్డి గ్రామానికి చెందిన ఎస్సీ మోర్చారు బిజెపి మండల అధ్యక్షుడు దండు రాజు భార్య కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి బాధీత కుటుంబ సభ్యులకు పరామర్శించి మనోధైర్యంతో ఉండి ముందుకు సాగాలని భరోసా అందజేశారు. అనంతరం బాధిత కుటుంబానికి 25 కేజీల రైస్ బ్యాగులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమాన్లు, నాయకులు నార్ల మల్లేష్, గణేష్ నాయక్, మాజీ బూతు అధ్యక్షులు ఈశ్వర్ తదితరులు ఉన్నారు.