సంఘ బంధం భవనం ప్రారంభం
25-05-2026 08:03 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని పరెడ్డిగూడెం గ్రామంలో సోమవారం సంఘ బంధం ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధులు 10 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు.సంఘబంధం పరిధిలోని సమభావన సంఘాలకు చెందిన మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతుండగా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం ద్వారా ఈ భవనాలను నిర్మించింది. దీంతో సమ భావన సంఘం మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు తొలగిపోయినట్టే. సలహాన సంఘాల మహిళలకు ఈ నూతన భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు.






